తెలంగాణ

telangana

ETV Bharat / international

మళ్లీ క్వారంటైన్​లోకి బ్రిటన్​ ప్రధాని - world coronavirus cases latest news

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 కోట్ల 48 లక్షలు దాటింది. ఇప్పటివరకు 13 లక్షల 24 వేల మందికి పైగా కొవిడ్​ ధాటికి బలయ్యారు. అమెరికా, ఐరోపా దేశాల్లోనే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. బ్రిటన్​ ప్రధాని రెండోసారి క్వారంటైన్​లోకి వెళ్లారు.

US covid-19 cases tally crosses 11 million mark
అమెరికాలో 11మిలియన్లు దాటిన కరోనా కేసులు

By

Published : Nov 16, 2020, 8:45 AM IST

Updated : Nov 16, 2020, 10:09 AM IST

ప్రపంచ దేశాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్​ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 48 లక్షలు దాటింది. మరణాలు 13 లక్షల 24 వేలు దాటాయి.

అమెరికాలో తాజాగా లక్షా 37 వేల మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 10 లక్షలు దాటింది. మరో 579 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2 లక్షల 51 వేలు దాటింది.

రాష్ట్రాల్లో లాక్​డౌన్-2.0!

అమెరికాలో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తొలుత కాలిఫోర్నియాలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయగా.. ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్​. అనంతరం టెక్సాస్​, వాషింగ్టన్​, మిషిగన్​ రాష్ట్రాలు కూడా.. వైరస్​ వ్యాప్తి నివారణకు కాలిఫోర్నియా మార్గాన్నే అనుసరిస్తున్నాయి.

ఐరోపా దేశాల్లోనూ కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బ్రిటన్​లో కొత్తగా 26,860 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 69 వేలు దాటింది. మరో 462 మంది మరణించారు.

స్వీయ నిర్బంధంలోకి బ్రిటన్​ పీఎం..

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన ఇటీవల కలిసిన ఓ పార్లమెంట్​ సభ్యుడికి కరోనా పాజిటవ్​గా తేలింది. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాతో హోం క్వారంటైన్​లోకి వెళ్లారు జాన్సన్​.

ప్రస్తుతానికి బోరిస్‌కు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. బోరిస్‌ జాన్సన్ ఏప్రిల్‌లో ఓసారి కరోనా బారినపడ్డారు. దాదాపు 3 రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. చికిత్స అనంతరం కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు.

  • ఫ్రాన్స్​లో తాజాగా 27,228 కేసులు వెలుగుచూడగా.. మరో 302 మంది చనిపోయారు.
  • ఇటలీలో ఒక్కరోజే 33,979 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 546 మంది ప్రాణాలు కోల్పోయారు.

రష్యాలో కొత్తగా 22,572 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 352 మంది మృతి చెందారు.

బ్రెజిల్​లో తాజాగా 14,134 కేసులు నమోదయ్యాయి. మరో 138 మంది మరణించారు.

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 1,13,65,052 2,51,832
బ్రెజిల్​ 58,63,093 1,65,811
ఫ్రాన్స్​ 19,81,827 44,548
రష్యా 19,25,825 33,186
ఇటలీ 11,78,529 45,229

ఇదీ చూడండి:నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్​ ఎక్స్ వ్యోమనౌక

Last Updated : Nov 16, 2020, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details