తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా, రష్యాలు తమ తీరును మార్చుకోవాలి'

తైవాన్​పై అక్రమాలకు పాల్పడుతూ.. సైనిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లకు గురిచేస్తున్న చైనాపై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. రష్యాలో నిరసనకారులు వ్యవహరిస్తున్న తీరునూ అమెరికా తప్పుబట్టింది.

america, russia, china
చైనా, రష్యాలు తమ తీరును మార్చకోవాలి: అమెరికా

By

Published : Jan 24, 2021, 11:52 AM IST

తైవాన్​కు స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి నిరాకరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న చైనాపై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. తైవాన్​ను సైనిక, ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడులకు గురిచేయవద్దని డ్రాగన్​కు సూచించింది. అందుకు బదులుగా అర్థవంతమైన చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్​ శనివారం తెలిపారు.

ఆ సహాయాన్ని కొనసాగిస్తాం..

ఇండో-పసిఫిక్ ప్రాంతంతో తమ సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందని ప్రైస్​ తెలిపారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో శాంతియుత మార్గానికి అమెరికా మద్దతునిస్తుందని చెప్పారు. తైవాన్​ ఆత్మరక్షణ చర్యల్లో తమ సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. తైవాన్​తో అమెరికా బంధం దృఢమైనదని పేర్కొన్నారు.

రష్యా వైఖరిపైనా ..

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసిస్తున్న వారిపై, జర్నలిస్టులపై రష్యా ప్రభుత్వ వైఖరిని అమెరికా ఖండించింది. అరెస్టు చేసిన ఆందోళనకారులను వెంటనేవిడుదల చేయాలని డిమాండ్​ చేసింది.

అలెక్సీ నావెల్నీపై విష ప్రయోగం కేసులో అంతర్జాతీయ సమాజం నిర్వహించే దర్యాప్తునకు సహకరించాలని రష్యాను కోరింది. రష్యా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details