వాతారవరణ మార్పుల కట్టడిలో పరస్పర సహకారం సహా ఇతర దేశాలకు తోడ్పాటు అందించేందుకు అమెరికా, చైనా అంగీకరించాయి. ఆ దిశగా తక్షణ కార్యాచరణ అమలుకు యూఎస్ ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ, చైనా ప్రతినిధి జీ జెన్హువాలు షాంఘైలో ఒప్పందం చేసుకున్నారు. వాతావరణ సంక్షోభంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తలపెట్టిన ప్రపంచ నేతల సదస్సు(ఏప్రిల్ 22-23)కు కొద్ది రోజుల ముందే ఈ ప్రకటన వెలువడింది.
వాతావరణ సంక్షోభంపై సహకారానికి అమెరికా-చైనా జట్టు
ప్రపంచంలో అధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేసే అమెరికా, చైనాలు వాతావరణ మార్పుల కట్టడిలో పరస్పర సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు అత్యవసరంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి.
వాతారవరణ మార్పులు, అమెరికా-చైనా
కర్బన కాలుష్య కారకాలను విడుదల చేసే దేశాల్లో అమెరికా, చైనాలే అన్నింటికన్నా ముందున్నాయి. భూతాపనికి కారణమయ్యే శిలాజ ఇంధన పొగలో సగం అవే బయటకు పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం.. వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న కృషికి ఊతమిస్తుంది. అయితే మానవ హక్కులు, వాణిజ్యం, చైనా దురాక్రమణలతో ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఈ ప్రయత్నాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:భూతాపాన్ని కట్టడి చేస్తేనే భవిత!