వేసవికాలం... మండే ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యటనలకు వెళ్లేవారు ఎందరో. పాఠశాలలకు, కళాశాలకు సెలవులు ఉండటం వల్ల ఈ సమయంలోనే ఎక్కువగా కుటుంబంతో పాటు పయనమౌతుంటారు. కొందరు విదేశాలకు వెళ్లాలనుకుంటారు. వీటిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు ట్రెండింగ్‌లో ఉన్నట్లు కయక్ అనే ట్రావెల్ సెర్చ్ ఇంజన్ తెలిపింది.
ఈ సంస్థ నివేదిక ప్రకారం... కుటుంబ విహారాలకు అమెరికాలోని హూస్టన్ మొదటి గమ్యస్థానం. ఈ ప్రాంతానికి సంబంధించి వెతికేవారు గత ఏడాదితో పోల్చితే 151 శాతం పెరిగారు.
బోస్టన్ రెండో గమ్యస్థానంగా ఉంది. ఈ నగరానికి సంబంధించి వెతుకులాట 103 శాతం పెరిగింది. మూడో స్థానంలో 87 శాతం వృద్ధితో లాస్ ఏంజెల్స్ నిలిచింది.
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నగరం గురించి వెతుకులాట 51శాతం పెరిగింది. కెనడాలోని టొరంటో ఐదో స్థానంలో ఉంది. ఈ నగర సెర్చింగ్ 44శాతం పెరిగింది.
కయక్ ప్రముఖ ట్రావెల్ సెర్చ్ ఇంజిన్‌గా ఉంది. ఇది ప్రయాణాలకు సంబంధించిన అన్ని సైట్లను వెతికి వినియోగదారులకు కావాల్సిన సమాచారం అందిస్తుంది. అలా ప్రయాణికులు విమానాలు, హోటళ్లు, అద్దె కార్లు, విహారయాత్ర ప్యాకేజీల వివరాలు తెలుసుకోవచ్చు.