అమెరికాపై మరోమారు ఆరోపణలు చేసింది చైనా. ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా, చట్టవిరుద్ధమైన గూఢచర్యం, నిఘాకు పాల్పడే హ్యాకర్లకు అమెరికా అతిపెద్ద సురక్షితమైన స్వర్గధామంగా ఉన్నట్లు ఆరోపించింది. పీఎర్ఐఎస్ఎం కార్యక్రమం ద్వారా ఇది నిరూపితమైందని వెల్లడించింది.
టిక్‌టాక్, వీచాట్ యాప్‌ల ద్వారా సమాచారం చైనా మిలిటరీకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చేరుతుందని పేర్కొన్నారు శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో. ఈ రెండు యాప్‌లపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
పీటర్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ.. అమెరికానే హ్యాకర్లకు అతిపెద్ద నిలయమని ఆరోపించారు చైనా ప్రతినిధి హువా చునైంగ్.