తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్ల ప్రాంతంలో విమాన ప్రమాదంపై అమెరికా దర్యాప్తు - US military aircraft crashed in eastern Afghanistan

అఫ్గానిస్థాన్​లో తమ సైనిక విమానం కుప్పకూలిన ఘటనపై అమెరికా సైన్యం దర్యాప్తు ప్రారంభించింది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో విమానం కూలిపోవడం వల్ల అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారని తాలిబన్లు ప్రకటించారు. అయితే ప్రమాదంపై స్పందించడానికి అగ్రరాజ్యం నిరాకరించింది.

US army investigating plane crash in Taliban-held area
తాలిబన్ల ప్రాంతంలో విమాన ప్రమాదంపై అమెరికా దర్యాప్తు

By

Published : Jan 28, 2020, 12:02 AM IST

Updated : Feb 28, 2020, 5:27 AM IST

అఫ్గానిస్థాన్​లోని ఘజినీ రాష్ట్రంలో విమానం కుప్పకూలిన ఘటనపై అమెరికా సైన్యాధికారులు దర్యాప్తు చేపట్టారు. తాలిబన్ల స్థావరాలకు సమీపంలో ఈ ఘటన జరగడం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఉగ్రవాదుల పనేనా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.

అమెరికా సైన్యంతో వెళ్తున్న విమానం తూర్పు అఫ్గానిస్థాన్​లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పకూలింది. సమాచారం అందుకున్న అఫ్గానిస్థాన్​ సైన్యం.. సహాయక చర్యలు చేపట్టింది.

భారీ సంఖ్యలో మృతులు?

విమానం కాలిపోతుండటం తాను చూసినట్టు ఓ స్థానిక జర్నలిస్టు తెలిపాడు. ఘటనలో విమాన ముందు, వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాలిబన్లపై పలు ఆరోపణలు చేశారు. ఘటనా స్థలంలో తాలిబన్లను భారీగా మోహరించారని తెలిపాడు. ప్రమాదం నుంచి ఇద్దరు తప్పించుకున్నట్టు వెల్లడించిన జర్నిలిస్టు... వారిని చంపేందుకు పరిసర గ్రామాల్లో ఉగ్రవాదులు కూంబింగ్​ చేపట్టినట్టు తెలిపాడు.

ఈ ఘటనలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారని తాలిబన్​ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.

బాధ్యులు ఎవరో..?

ఈ ఘటనపై స్పందించడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. విమానం అమెరికాకు చెందినదిగా గుర్తించడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.

అయితే ఘటనాస్థలం నుంచి తీసిన చిత్రాల్లో కుప్పకూలిన విమానం.. అమెరికా సైన్యానికి చెందిన ఈ-11ఏగా స్పష్టమవుతోందన్నారు .

తాలిబన్ల ప్రాంతంలో విమాన ప్రమాదంపై అమెరికా దర్యాప్తు

ఇదీ చూడండి:అఫ్గానిస్థాన్​లో విమాన ప్రమాదం- పలువురు మృతి!

Last Updated : Feb 28, 2020, 5:27 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details