జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాక్ తమదేశం నుంచి భారత రాయబారిని వెళ్లిపోవాలని ఆదేశించింది. దక్షిణాసియాలో శాంతి స్థాపన దిశగా ఇరుదేశాలు చర్చలు జరపాలని అమెరికా సూచించింది. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు అగ్రరాజ్యం సాయపడుతుందంటూ శ్వేతసౌధం సీనియర్ అధికారి తెలిపారు. ఇరు దేశాలమధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది.
'యుద్ధ వాతావరణం రాకముందే చర్చలు జరపండి'
దక్షిణాసియాలో యుద్ధ పరిస్థితులు తలెత్తకుండా భారత్-పాక్ అత్యవసరంగా చర్చలు జరపాల్సిన అవసరముందని అమెరికా శ్వేతసౌధ అధికారి తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని సూచించారు.
'యుద్ధ వాతావరణం రాకముందే చర్చలు జరపండి'
ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగే దిశగా ఇరు దేశాలు వెంటనే చర్చలు జరపాలని సూచించింది. 370 రద్దుకు సంబంధించి యూఎస్‌కు ముందే భారత్ సమాచారం ఇచ్చిందంటూ వస్తున్న వార్తలను శ్వేతసౌధం తోసి పుచ్చింది.
ఇదీ చూడండి:కశ్మీర్‌పై సౌదీ యువరాజుతో ఇమ్రాన్ చర్చలు