భారీ వర్షాలు, వరదలతో నేపాల్ జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 43కు చేరింది. 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. 24 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
నేపాల్ వరదలు... 43కి చేరిన మృతుల సంఖ్య - కొండచరియలు
నేపాల్ వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 43కు చేరింది. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతైన 24 మంది ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

నేపాల్ వరదలు... 43కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్ వరదలు... 43కి చేరిన మృతుల సంఖ్య
భారీ వర్షాల ధాటికిపలు చోట్లకొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదల కారణంగా సుమారు 6 వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.
ఇదీ చూడండి: ఇటలీలో చెలరేగిన కార్చిచ్చు... రంగంలోకి విమానాలు