అంగారక గ్రహం మీదకు యూఏఈ పంపిన మొదటి ఉపగ్రహం 'హోప్/అమల్'.. అరుణ గ్రహానికి సంబంధించి ఫోటోని పంపించింది. ఈ మేరకు యూఏఈ ఆ చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో.. అరుణ గ్రహ ఉత్తర ధ్రువం, అక్కడి అతిపెద్ద అగ్నిపర్వతం 'ఒలింపస్ మాన్స్' దర్శనమిస్తున్నాయి.
'అమల్' పంపిన అమూల్య చిత్రం - అంగార గ్రహం మీదకు యూఏఈ పంపించిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు
అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన యూఏఈ తొలి వ్యోమనౌక అమల్.. అరుణ గ్రహ ఉపరితల చిత్రాన్ని పంపించింది.
!['అమల్' పంపిన అమూల్య చిత్రం United Arab Emirates publishes first photo from Mars probe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10627826-thumbnail-3x2-hjl.jpg)
'హోప్' పంపిన అంగారక చిత్రాన్ని విడుదల చేసిన యూఏఈ
గతేడాది జూలైలో జపాన్ అంతరిక్ష కేంద్రం నుంచి యూఏఈ హోప్ ఉపగ్రహాన్ని అంగారకుని మీదుకు విజయవంతంగా పంపించింది. ఏడు నెలలు అంతరిక్షంలో ప్రయాణించిన హోప్ మంగళవారం (ఫిబ్రవరి 9న) అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. యూఏఈ.. మార్స్‌పైకి పంపించిన ఈ ఉపగ్రహంతో అరబ్ ప్రపంచంలో ఒక నూతన శకాన్ని ప్రారంభించింది.
ఇదీ చూడండి:అబుదాబి ప్రఖ్యాత టవర్‌పై భారత పతాక ప్రదర్శన
Last Updated : Feb 15, 2021, 5:45 AM IST