తెలంగాణ

telangana

ETV Bharat / international

మానవసహిత అంతరిక్షయాత్రకు యూఏఈ కసరత్తు - యూఏఈ అప్డేట్స్​

అంగారకుడి కక్ష్యలోకి ఇటీవల ఓ ఉపగ్రహాన్ని పంపిన యూఏఈ.. మానవ సహిత అంతరిక్ష యాత్రకూ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేయగా.. వారిలో ఒకరు మహిళ కావడం విశేషం.

United Arab Emirates names 2 new astronauts, including woman
మానవసహిత అంతరిక్షయాత్రకు కసరత్తు

By

Published : Apr 11, 2021, 8:32 AM IST

అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ఒక ఉపగ్రహాన్ని పంపిన యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​(యూఏఈ).. మానవ సహిత అంతరిక్ష యాత్రకూ సమాయత్తమవుతోంది. ఈ దిశగా ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేసింది. వారిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరు నౌరా ఆల్​ మాత్రౌషి. ఈ మేరకు దుబాయ్​ పాలకుడు షేక్​ మహ్మద్​ బిన్ రషీద్​ అల్​ మాక్తౌమ్​ శనివారం ట్విట్టర్​లో వెల్లడించారు.

4 వేల మంది దరఖాస్తుదారులను వడపోసి వీరిద్దరిని ఎంపిక చేశారు. వీరు అమెరికాలోని జాన్సన్​ స్పేస్​ సెంటర్​లో శిక్షణ పొందుతారు. 2019లో యూఏఈకి చెందిన హజా అల్​ మన్సూరీ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్​)లో 8 రోజులు గడిపారు. తద్వారా అరబ్​ ప్రపంచ తొలి వ్యోమగామిగా గుర్తింపు పొందారు. 2024లో చంద్రుడిపైకి మానవరహిత వ్యోమనౌకను పంపాలని యూఏఈ భావిస్తోంది.

ఇదీ చదవండి:అంగారకుడి‌పై హెలికాప్టర్‌.. ఎగిరేందుకు సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details