అఫ్గానిస్థాన్‌లో బాలికల విద్యకు(Girl Education In Afghanistan) త్వరలోనే అనుమతి లభించనున్నట్లు ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఓమర్ అబ్దీ ప్రకటించారు. ఈ విషయాన్ని తాలిబన్ (Taliban News) ప్రభుత్వమే తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.
Taliban News: అఫ్గాన్‌లో బాలికల విద్యకు వీడనున్న గ్రహణం! - బాలికల విద్యకు ఓకే చెప్పిన తాలిబన్లు
అఫ్గాన్‌లో తాలిబన్లు (Taliban News) అధికారం చేపట్టాక బాలికల విద్యపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బాలికలను సెకండరీ స్కూలింగ్‌కు(Girl Education In Afghanistan) అనుమతించనున్నట్లు ఐరాస సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ విషయంపై తాలిబన్ ప్రభుత్వం త్వరలోనే కార్యచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

యూనిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓమర్ అబ్దీ.. గతవారం కాబుల్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తాలిబన్ విద్యాశాఖమంత్రితో మాట్లాడినట్లు తెలిపారు. బాలికల విద్యకు (Girl Education In Afghanistan) అనుమతి ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు మంత్రి తనతో చెప్పిట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణను త్వరలోనే వారు ప్రకటించనున్నారని అన్నారు. అఫ్గాన్‌లోని మొత్తం 34 ప్రావిన్స్‌ల్లో ఐదింటిలో ఇప్పటికే బాలికలను సెకండరీ స్కూలింగ్ అనుమతిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:కత్తిదాడిలో ఎంపీ మృతి- అందరూ చూస్తుండగానే..