తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 10:58 AM IST

ETV Bharat / international

'కరోనా వచ్చినా వుహాన్​ మార్కెట్​ను మూసేయలేం'

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువుల విక్రయశాలలను మూసివేసేలా సిఫార్సు చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. ఇవి మిలియన్ల మందికి జీవనోపాధిగా ఉన్నాయని, ఆహారాన్ని అందిస్తున్నాయని తెలిపింది. మార్కెట్లను మూసివేసే బదులు.. భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించాలని అభిప్రాయపడింది.

UN: Live animal markets shouldn't be closed despite virus
'మాంసం దుకాణాలను మూసేయాలని చెప్పలేం'

కరోనా వ్యాప్తికి కారణమని భావిస్తున్న.. వుహాన్​లోని మాంసం దుకాణాలు సహా ప్రపంచవ్యాప్తంగా జంతువుల విక్రయశాలలను మూసేయాలని సిఫార్సు చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. ఈ మార్కెట్లు ఎంతో మందికి ఆహారం అందించడమే కాక.. జీవనోపాధి మార్గంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

చైనాలోని వుహాన్‌ సముద్ర జీవుల విక్రయశాలలోనే కరోనా వైరస్‌ పుట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో స్పందించింది డబ్ల్యూహెచ్​ఓ. వీటిని మూసివేసే బదులు.. సదుపాయాలు, ప్రమాణాలు మెరుగుపరచడంపై దృష్టి సారించాలని సూచించారు డబ్ల్యూహెచ్​ఓ ఆహార భద్రతా నిపుణుడు పీటర్​ బెన్ ఎంబారెక్.

అక్కడ మామూలే...

ఇలాంటి మార్కెట్లలో.. ఆహార భద్రత కష్టమేనని, అందుకే కొన్నిసార్లు వైరస్‌లు ప్రబలుతాయని తెలిపారు. ఇది తమకు ఆశ్చర్యమేం కలిగించట్లేదని అన్నారు పీటర్. శుభ్రత, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడం ద్వారా... జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించారు.

మొట్టమొదటగా.. వుహాన్​లోని​ వెట్​ మార్కెట్లలోనే పదులకొద్దీ కొవిడ్​ కేసులు వెలుగుచూశాయన్న అంశంపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు పీటర్​. వైరస్​ సృష్టి, వ్యాప్తికి కారణమైన జీవి ఏదనే విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని వివరించారు.

'మా జోక్యం ఎందుకు?'

వుహాన్​ మాంసం దుకాణాల్లోనే తొలి కరోనా కేసు నమోదైందని.. తొలుత ప్రపంచదేశాలు ఆరోపించాయి. ఇప్పటివరకు దీనిపై దర్యాప్తు జరిపించేందుకు.. డబ్ల్యూహెచ్​ఓను, లేదా ఏ ఇతర నిపుణుల బృందాన్నీ ఆహ్వానించలేదు చైనా. దీనిపైనా మాట్లాడిన బెన్​ ఎంబారెక్​.. ఇలాంటి వాటిపై అధ్యయనం చేసేందుకు చైనాకు చాలినంత నైపుణ్యం ఉందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details