తెలంగాణ

telangana

ETV Bharat / international

'మయన్మార్​కు సివిల్ వార్​ ముప్పు!'

సైనిక పాలనకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసనలు చేపడుతున్న ప్రజలు రక్షణాత్మక ధోరణిని వీడి ప్రతిదాడికి దిగే సంకేతాలు కన్పిస్తున్నాయని ఐరాస ప్రత్యేక రాయబారి హెచ్చరించారు. అక్కడ మునుపటిలా సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు సాయుధ తెగల దళాలు, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఆందోళన చేస్తున్న సంఘాలు, సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు జరపాలనే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

UN envoy warns of possible civil war in Myanmar
'మయన్మార్​లో సివిల్ వార్​ ముప్పు'

By

Published : May 25, 2021, 12:52 PM IST

మయన్మార్​లో అంతర్యుద్ధం సంభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆ దేశానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా ఉన్న క్రిసిన్​ స్క్రానర్​ బర్గ్​నర్​ హెచ్చరించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా నిరసనలు చేపడుతున్న ప్రజలు రక్షణాత్మక ధోరణిని వీడి ప్రతిదాడికి దిగే సంకేతాలు కన్పిస్తున్నాయన్నారు. ఇంట్లో తయారు చేసిన ఆయుధాలు ఉపయోగించడం, సాయుధ తెగలతో శిక్షణ తీసుకోవడం చూస్తుంటే ఇది స్పష్టమవుతోందని చెప్పారు. సైన్యం దాడుల భయంతోనే వారి తీరులో మార్పు వచ్చిందని వివరించారు.

ఈ పరిస్థితిని గమనించే కొద్ది వారాలుగా థాయి​లాండ్​లో ఉన్న తాను వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపినట్లు బర్గ్​నర్ వెల్లడించారు. మయన్మార్​లో మునుపటిలా సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు సాయుధ తెగల దళాలు, రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఆందోళన చేస్తున్న సంఘాలు, సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఇందులోకి తీసుకురావాలన్నారు. అయితే అందరినీ ఒప్పించడం అంత సులభం కాదని బర్గ్​నర్​ స్పష్టం చేశారు.

జరిగిన రక్తపాతం చాలు..

మయన్మార్​లో మరింత రక్తపాతం, అంతర్యుద్ధం జరగకుండా నిలువరించేందుకు తన కార్యాలయం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని అన్నారు బర్గ్​నర్​. మయన్మార్​ను మునుపటిలా సాధారణ పరిస్థితుల్లో చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని అక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.

మయన్మార్​లో పరిస్థితి బాధాకరంగా ఉందని బర్గ్​నర్​ ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక పాలన తర్వాత హింసాత్మక ఘటనల్లో 800మంది మరణించారని, 5,300మంది అరెస్టయ్యారని తెలిపారు. పశ్చిమ చిన్ రాష్ట్రం మిందత్ పట్ణణంలో అనధికారిక మరణాలు, ఇళ్ల ధ్వసం, అనేక మంది గాయపడ్డారనే వార్తలను కూడా ప్రస్తావించారు.

సైన్యం నిర్బంధంలో ఉన్న మయన్మార్ అధ్యక్షురాలు ఆంగ్​ సాన్​ సూకీ పార్టీ- నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీని రద్దు చేసేందుకు సైన్యం ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

ఇదీ చూడండి:కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన సూకీ

'మయన్మార్​పై 'ఆసియాన్​' కృషి అభినందనీయం'

మయన్మార్ సైనిక చర్య- ప్రజాస్వామ్యానికి విఘాతం‌

ABOUT THE AUTHOR

...view details