తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస బ్లాక్​లిస్ట్​లో తాలిబన్​ ఉగ్ర సంస్థ నాయకుడు

తాలిబన్ ఉగ్రసంస్థ నాయకుడు నూర్​ వాలి మెహ్​సుద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. అతడిపై ఆర్థిక, ప్రయాణ, ఆయుధ ఆంక్షలు విధించింది. వీటిని అన్ని దేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది.

UN blacklists Pakistan Taliban terror group's leader
ఐరాస బ్లాక్​లిస్ట్​లో తాలిబన్​ ఉగ్ర సంస్థ నాయకుడు

By

Published : Jul 17, 2020, 10:01 AM IST

పాకిస్థాన్​కు చెందిన తెహ్రీక్​-ఏ-తాలిబన్​ ఉగ్రసంస్థ నాయకుడు నూర్​ వాలి మెహ్​సుద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. అల్​ఖైదా తీవ్రవాద సంస్థకు ఆర్థిక సాయం సహా ఇతర కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అతడిపై చర్యలకు ఉప్రక్రమించింది.

గురువారం నుంచి మెహ్​సుద్​పై ఆర్థిక, పర్యటక ఆంక్షలు విధిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అల్​ఖైదా ఆంక్షల కమిటీ ప్రకటించాయి. అతడి ఆస్తులు స్తంభింపచేసి ఆయుధాలు, విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.

2018లో మౌలానా ఫజాలుల్లా మృతి చెందినప్పటి నుంచి తాలిబన్ల నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు మెహ్​సుద్​. తెహ్రీక్​-ఏ-తాలిబన్​ పాకిస్థాన్ సంస్థను 2011 జులై 29న బ్లాక్​లిస్ట్​లో చేర్చింది ఐరాస.

మెహ్​సుద్​ నాయకత్వంలో తాలిబన్​ ఉగ్ర సంస్థ భయానక దాడులకు పాల్పడినట్ల అల్​ఖైదా ఆంక్షల కమిటీ తెలిపింది. పాకిస్థాన్​లో పలు చోట్ల సహా, ఆ దేశ బలగాలను లక్ష్యంగా చేసుకుని గతేడాది జులై, ఆగస్టులో ఘాతుకాలకు పాల్పడినట్లు పేర్కొంది.

2010 మేలో టైమ్స్​ స్క్వేర్​లో జరిగిన బాంబు దాడి, అదే ఏడాది ఏప్రిల్​లో పెషావర్​లోని అమెరికా కాన్సులేట్​పై​ జరిగిన దాడులకు పాల్పడింది తాలిబన్​ సంస్థే. మెహ్​సుద్​ను బ్లాక్​లిస్ట్​లో చేర్చడాన్ని అమెరికా స్వాగతించింది.

ఇదీ చూడండి: లద్దాఖ్​కు రాజ్​నాథ్​.. సైనిక సన్నద్ధతపై సమీక్ష

ABOUT THE AUTHOR

...view details