ఉత్తర కొరియాకు కీలక ఆదేశాలు జారీచేసింది ఐరాస మానవహక్కుల విభాగం. కరోనా నిబంధనలకు విరుద్ధంగా దేశ ఉత్తర సరిహద్దులను దాటినవారిని కనిపించగానే కాల్చేయాలని ఆదేశాలు జారీ చేయడం నిజమేనా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ దేశానికే చెందిన డైలీ ఎన్కే అనే మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించింది ఐరాస.
దక్షిణ కొరియా సంస్కృతిని ప్రచారం చేసేలా ఉన్న వస్తువులు, సెక్సువల్ కంటెంట్‌ను పంపిణీ చేసినవారికి మరణశిక్ష విధించేలా గతేడాది డిసెంబర్లో చట్టం చేశారా అని కూడా ఉత్తర కొరియాను ఐరాస ప్రశ్నించింది. దీనిపై దక్షిణ కొరియా హక్కుల కార్యకర్తలు ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఐరాసను కోరారు.
ఉత్తర్వులు నిజమేనా?
షూట్ ఆన్సైట్ ఆదేశాలిచ్చినట్లు ఉత్తర కొరియా ఇప్పటివరకు అధికారికంగా అంగీకరించలేదు. అయితే... "వైరస్ కట్టడిలో భాగంగా చైనా, రష్యాతో కలిసే ఉత్తర సరిహద్దులను మూసివేస్తున్నాం. అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించేవారిపై షూట్ ఆన్ సైట్ ఆదేశాలు జారీచేస్తున్నాం." అని ఉత్తర కొరియా ప్రభుత్వం ఓ ప్రకటన చేసిందని డైలీ ఎన్కే 2020 ఆగస్టులో కథనం ప్రచురించింది. 1-2కి.మీలు ఉన్న ఆ బఫర్ జోన్లోకి అనధికారికంగా ప్రవేశించినవారిపై బేషరతుగా కాల్పులు జరపవచ్చని భద్రతా బలగాలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని పేర్కొంది.
కొద్దిరోజులకే...