Ukraine Crisis: 2027 నాటికి రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడటాన్ని యూరోపియన్ దేశాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మే చివరి నాటికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు ఈయూ తెలిపింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
"రష్యా గ్యాస్, చమురు, బొగ్గుపై ఆధారపడడాన్ని 2027 నాటికి దశలవారీగా తగ్గించాలని ప్రతిపాదన తీసుకొస్తున్నాము. ఇందుకు యూరోపియన్ దేశాల్లోని వనరులపై ఆధారపడాల్సి ఉంటుంది." అని చెప్పారు.