Ukraine Crisis 2022: ఉక్రెయిన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, నాటో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రష్యా మాత్రం వెనకడుగు వేసినట్లు కనిపించడం లేదు. తమ అత్యున్నత భద్రతా అధికారుల డిమాండ్లను అమెరికా, దాని మిత్ర దేశాలు విస్మరించాయని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. అయితే దీనిపై అమెరికా, నాటోతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు.
"ఉక్రెయిన్ను ఎప్పటికీ నాటోలో భాగం చేసుకుబోమని అమెరికా ప్రభుత్వం, నాటో దేశాలు చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి. రష్యా సరిహద్దులో మోహరించిన నాటో సైన్యాన్ని, ఆయుధాలను వెనక్కు పంపాలని.. ఇప్పటికే మోహరించిన ఆయుధాలను ఉపసంహరించుకోవాలి" వంటి డిమాండ్లను అమెరికా, దాని మిత్ర దేశాలు పక్కనపెట్టాయని పుతిన్ పేర్కొన్నారు.
అమెరికా దాని మిత్రదేశాలు.. రష్యా డిమాండ్‌లను విస్మరించడం.. అన్ని దేశాల భద్రతకు సంబంధించిన సమగ్రతపై వారి బాధ్యతలను ఉల్లంఘించడమేనని రష్యా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. మరిన్ని చర్చల ద్వారా సమస్యను పరిష్కారించవచ్చన్నారు.