తెలంగాణ

telangana

ETV Bharat / international

'హాంకాంగ్​ విషయంలో చైనా వెనక్కి తగ్గాల్సిందే' - 'హాంకాంగ్​ స్వయం ప్రతిపత్తిని గౌరవించండి'

హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోకుడదని చైనాకు సూచించింది బ్రిటన్. వివాదస్పద జాతీయ భద్రతా చట్టంలో మరింత ముందుకెళితే బ్రిటిష్ ఓవర్సీస్ వీసాను హాంకాంగ్ వాసులకు జారీ చేస్తామని హెచ్చరించింది.

hongkong
'హాంకాంగ్​ స్వయం ప్రతిపత్తిని గౌరవించండి'

By

Published : Jun 3, 2020, 6:01 AM IST

హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిలో జోక్యం చేసుకోవద్దని.. చైనాకు సూచించింది బ్రిటన్. తమ చర్యలను వెంటనే విరమించుకోవాలని తేల్చిచెప్పింది. వివాదాస్పద జాతీయ భద్రతా చట్టం అంశంలో మరింత ముందుకు వెళితే.. ఇతర ప్రాంతాల్లోని బ్రిటిష్​ పౌరుల పాస్​పోర్ట్​ను(బ్రిటన్ నేషనల్ ఓవర్సీస్) హాంకాంగ్​వాసులకు అందిస్తామని వెల్లడించింది. ఈ పాస్​పోర్ట్​ ద్వారా అనంతర కాలంలో పౌరసత్వాన్ని కూడా కల్పిస్తుంది బ్రిటన్. ఈ మేరకు బ్రిటన్ పార్లమెంట్​ కామన్స్​ సభలో ఓ ప్రకటన విడుదల చేశారు విదేశాంగ మంత్రి డోమినిక్​ రాబ్. ఒకప్పటి బ్రిటన్​ వలసరాజ్యంలో ప్రజల స్వేచ్ఛకు చైనా వల్ల భంగం కలుగుతోందని పేర్కొన్నారు.

"చైనా పునరాలోచించుకునేందుకు సమయం ఉంది. హాంకాంగ్​పై చేపట్టాలనుకున్న చర్యలను విరమించుకోవడానికి ఇంకా సమయం ఉంది. చైనాకు ఉన్న అంతర్జాతీయ లక్ష్యాల దృష్ట్యా హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని గౌరవించాలి. చైనా ప్రస్తుత వైఖరినే అనుసరిస్తూ జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదిస్తే మేం చేపట్టాల్సిన తదుపరి చర్యను చేపడతాం. ఇతర ప్రాంతాల్లో ఉన్న బ్రిటన్ పౌరులుగా హాంకాంగ్​లోని వారికి పాస్​పోర్ట్​ జారీ చేస్తాం."

-డోమినిక్ రాబ్, బ్రిటన్ విదేశాంగ మంత్రి

బ్రిటన్ ఆధారిత భూభాగాల్లోని వారికి బీఎన్​ఓ పాస్​పోర్ట్​ను అందిస్తుంది బ్రిటన్. 1984లో హాంకాంగ్​తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:అమెరికాలో ఎటుచూసినా నిరసన జ్వాలలే.

ABOUT THE AUTHOR

...view details