యూఏఈలో ఉంటున్న భారత వలస కార్మికులు, చిరుద్యోగులు స్వదేశానికి వచ్చేందుకు విమాన టిక్కెట్ల కోసం తమ దగ్గరున్న బంగారం అమ్మేస్తున్నారు. కొవిడ్ ప్రభావంతో అకస్మాత్తుగా ఉపాధి కోల్పోవడం, జీతాల్లో కోతలతో చాలామంది చేతిలో సరిపడా డబ్బులేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మే 7 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమవడంతో ఒక్కసారిగా వీరి బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి.
విమాన టిక్కెట్ల కోసం బంగారం అమ్మేస్తున్నారు - Expats in UAE sell high-value gold to buy airline tickets
విదేశాల్లో (యూఏఈ) చిక్కుకున్న ప్రవాస భారతీయులు స్వదేశం వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా ధాటికి ఉపాధి కోల్పోవడం, జీతాల్లో కోత పడిన నేపథ్యంలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా స్వదేశం వచ్చేందుకుగాను విమాన టిక్కెట్ల కోసం తమ వద్ద ఉన్న బంగారం అమ్మేసుకుంటున్నారు.
విమాన టిక్కెట్ల కోసం..బంగారం అమ్మేస్తున్నారు
దుబాయ్‌లోని మీనాబజార్, డేరా ప్రాంతాల్లోని చిన్నచిన్న బంగారు దుకాణాలలో ఎక్కువగా ఇలాంటి లావాదేవీలే జరుగుతున్నాయి. ఇక్కడ నివాసం ఉంటున్న పెద్ద కంపెనీల ఉద్యోగులు సైతం తమ కుటుంబసభ్యులను స్వదేశానికి పంపిస్తున్నారు. వీరంతా తమ బంగారాన్ని భారత్‌కు వచ్చాక అమ్ముకుంటే 10-12 శాతం ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా.. ప్రస్తుతానికి చేతిలో డబ్బు ఉండటమే ముఖ్యమని భావిస్తున్నారు. దుబాయ్‌లో సోమవారం 22 క్యారెట్ల గ్రాము బంగారం 193.50 దిర్హమ్‌లు(రూ.3,963) పలికింది.