తెలంగాణ

telangana

ETV Bharat / international

కొరియాలో మేసాక్ తుపాను బీభత్సం

మేసాక్ తుపాను దక్షిణ కొరియాను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగాయి. వరద ధాటికి 5,800 ఆవులను తరలిస్తున్న ఓడ నీట మునిగింది. దాదాపు 2.70 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ కొరియాలో ఒకరిని బలిగొన్న మేసాక్ తీరం దాటి ఇప్పుడు ఉత్తర కొరియాలో బీభత్సం సృష్టిస్తోంది.

typhoon-maysak-hits-southern-south-korea-and-north-korea
తుపాను ధాటికి నీట మునిగిన 5,800 ఆవులు!

By

Published : Sep 3, 2020, 1:13 PM IST

శక్తిమంతమైన మేసాక్ తుపాను దక్షిణ కొరియా తీరంలో విధ్వంసం సృష్టించింది. తీరం దాటే ముందు తూర్పు దక్షిణ ప్రాంతాలపై భీకరంగా విరుచుకుపడింది. మేసాక్‌ ధాటికి వందలాది చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు.. నదులు ఉప్పొంగి పరివాహక ప్రాంతాలని ముంచెత్తాయి.

ఆగమైన బతుకులు

తుపాను ధాటికి ఆవులు తరలిస్తున్న ఓ నౌక నీటమునిగింది. ఆ సమయంలో.. ఓడలో 5వేల 800 ఆవులు సహా 42 మంది.. సిబ్బంది ఉన్నారు. వీరి కోసం బుధవారం గాలింపు మొదలు కాగా.. సిబ్బందిలో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒకర్ని జపాన్ కోస్ట్ గార్డులు కాపాడారు.

తుపాను ధాటికి నీట మునిగిన 5,800 ఆవులు!

లక్షల ఇళ్లకు కరెంటు కట్

గంటకు 140 కి.మీల వేగంతో వీస్తున్న ఈదురు గాలులకు.. చెట్లు విరిగిపడ్డాయి. సైన్ బోర్డులు, విద్యుత్ స్తంభాలు కూలిపడ్డాయి. బూసాన్ రాష్ట్రంలో గాలులకు భవనం అద్దాలు పగిలి ఓ మహిళ మృతి చెందింది.

విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమై దాదాపు 2 లక్షల 70 వేల ఇళ్లకు.. కరెంటు సరఫరా నిలిచిపోయింది. సుమారు 2,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం.

దక్షిణ కొరియా గాంగ్న్యూంగ్ మీదుగా తీరం దాటిన తర్వాత బలహీనపడిన తుపాను.. ఉత్తర కొరియా తీరం వైపు వెళ్లింది.

ఉత్తర కొరియాలో బీభత్సం

మేసాక్ ఇప్పుడు ఉత్తర కొరియాను వణికిస్తోంది. తూర్పు తీర నగరాలైన వోన్సాన్ , టాంచన్ ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగుతోంది. కాంగ్వాన్, ఉత్తర హామ్గోంగ్ రాష్ట్రాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ప్యోంగ్యాంగ్ లో తైడాంగ్ నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి పెరిగింది.

ఇదీ చదవండి:అమెరికా పోలీసుల క్రూరత్వం.. ముఖానికి కవర్ తొడిగి..

ABOUT THE AUTHOR

...view details