తెలంగాణ

telangana

ETV Bharat / international

టోక్యోను ముంచెత్తనున్న మరో తుపాను.? - Tokyo, government warned residents

జపాన్ రాజధాని టోక్యో దిశగా మరో తుపాను ముంచుకొస్తోంది. ఈదురు గాలులతో తీర ప్రాంతమంతా స్తంభించబోతోందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజధాని నగరాన్ని తుపాను అతలాకుతలం చేసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రకటన విడుదల చేసింది.

టోక్యోను ముంచెత్తేందుకు సిద్ధమవుతోన్న మరో తుపాను

By

Published : Oct 11, 2019, 8:44 PM IST

Updated : Oct 12, 2019, 7:47 AM IST

టోక్యోను ముంచెత్తనున్న మరో తుపాను.?
జపాన్ రాజధాని టోక్యో వైపు మరో భారీ తుపాను దూసుకొస్తోంది. సెప్టెంబర్​లో వచ్చిన ఫక్సాయి తుపాను తర్వాత.. మళ్లీ 80 సెం.మీల వర్షపాతం, 250 కి.మీ వేగంతో వీస్తున్న ఈదురు గాలులు నగరాన్ని అతలాకుతలం చేయబోతున్నాయని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే తీర ప్రాంత ప్రజలను నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవాలని సూచించింది అక్కడి ప్రభుత్వం.
ఫక్సాయి​ తుపాను సుమారు 2 వేల విద్యుత్ స్తంభాలను పడగొట్టింది. ఒక దశలో 9 లక్షల ఇళ్లకు పైగా విద్యుత్తు లేకుండా పోయింది. అందుకే ఈ తుపానును సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రజలను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. తమ వద్ద తగినంత ఆహారం, నీరు, ఫోన్​లో ఛార్జ్ ఉండేలా చూసుకోవాలని కోరింది.

తుపాను తాకిడికి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండబోదేమోనని.. ప్రజలు నీళ్ల బాటిళ్లు, నూడుల్స్​ వంటి ఆహార పదార్థాలు కొనడానికి సూపర్ ​మార్కెట్ల బాట పట్టారు.

తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైలు, విమాన సర్వీసులపై ప్రభావం పడనుంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను కారణంగా రగ్బీ ప్రపంచకప్​ మ్యాచ్ రద్దయింది. తీర ప్రాంతాల్లో పడవ ప్రయాణాలు నిలిపేశారు.

ఇదీ చూడండి:ఇరాన్​ చమురు ట్యాంకర్​పై రాకెట్​ దాడులు

Last Updated : Oct 12, 2019, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details