తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో ఇద్దరు జడ్జిలను కాల్చి చంపిన ఉగ్రవాదులు

అఫ్గానిస్థాన్​లో తాలిబన్​ ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. అఫ్గాన్​లో అమెరికా బలగాలను తగ్గిస్తామని అగ్రరాజ్యం ప్రకటించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.

TWO WOMEN JUDGES ARE KILLED BY GUNMEN IN KABUL
కాబూల్‌లో జడ్జిలను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By

Published : Jan 17, 2021, 10:15 PM IST

అఫ్గానిస్థాన్‌లో ఎక్కడో ఒక చోట నిత్యం ఉగ్రదాడులు జరగుతూనే ఉంటాయి. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు బలైపోతుంటారు. అయితే.. ఇటీవల ఉగ్రవాదులు పంథా మార్చారు. దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా దేశ రాజధాని కాబూల్‌లోని సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు మహిళా న్యాయమూర్తులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సుప్రీంకోర్టుకు కారులో వెళ్తుండగా మహిళా న్యాయమూర్తులపై దాడి చేసి హత్య చేసినట్లు కోర్టు ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.

రెండు రోజులకే..

రానున్న రెండు దశాబ్దాల్లో అఫ్గాన్‌లో అమెరికా బలగాలను తగ్గిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. దేశంలో శాంతి నెలకొల్పడం కోసం తాలిబన్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా దాడులు మాత్రం ఆగట్లేదు. గత కొన్ని నెలలుగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, న్యాయవాదులు హత్యకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:ఇరాక్​లో బాంబు దాడి.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details