తెలంగాణ

telangana

ఆ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా ప్రపంచదేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా నిలిచింది దక్షిణ కొరియా. మరోవైపు జపాన్​ తీరంలో నిలిపి ఉంచిన డైమండ్​ ప్రిన్సెస్​ నౌకలో తాజాగా మరో ఇద్దరు భారతీయ సిబ్బందికి కరోనా సోకినట్లు వెల్లడించారు అధికారులు.

By

Published : Feb 25, 2020, 5:30 AM IST

Published : Feb 25, 2020, 5:30 AM IST

Updated : Mar 2, 2020, 11:52 AM IST

Two more Indians on board cruise ship test positive for coronavirus: Embassy
ఆ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

ఆ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కరోనా

కరోనా రోజురోజుకూ మరింత విజృంభిస్తూనే ఉంది. బాధితులు చైనాలోనే అధిక భాగం ఉన్నప్పటికీ మెల్లమెల్లగా దక్షిణ కొరియానూ ఈ కొవిడ్​-19 వైరస్​ వణికిస్తోంది. చైనా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా ద.కొరియా రెండో స్థానంలో ఉంది.

సోమవారం రోజు మరో 161, మంగళవారం మరో 60 కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య ఇక్కడ 893కు చేరింది. ఇప్పటివరకు దక్షిణ కొరియాలో కరోనా సోకిన వారిల్లో మృతుల సంఖ్య 8కు చేరినట్లు అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తితో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధ్యక్షుడు మూన్​-జే-ఇన్​. ఈ నేపథ్యంలో చైనా నుంచి రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఆ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు...

జపాన్​ తీరంలో నిలిపి ఉంచిన డైమండ్​ ప్రిన్సెస్ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కరోనా సోకినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా అక్కడి భారతీయ బాధితుల సంఖ్య 14కు చేరినట్లయింది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తం నౌకలో 3711 మంది ఉన్నారు. ఇందులో 138 మంది భారతీయులు.(132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) ఫిబ్రవరి 3 న ఈ క్రూయిజ్​ షిప్​ను టోక్యో సమీపంలోని యొకొహమా పోర్ట్​ వద్ద నిలిపిఉంచారు. ఈ నౌకలో ఇప్పటివరకు ఇద్దరు ప్రయాణికులు మరణించారు.

Last Updated : Mar 2, 2020, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details