పాక్ సరిహద్దులో ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసింది ఆ దేశ సైన్యం. గిల్గిట్- బాల్టిస్థాన్ నియంత్రణ రేఖ ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్న పాక్ సైనిక బృందం.. ఆ ఇద్దరూ గూఢచారులనే అభియోగం మోపుతూ ఆ దేశ పోలీసులకు అప్పగించింది.
గూఢచర్య అభియోగం.. పాక్ చెరలో ఇద్దరు భారతీయులు
నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక విభాగం ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసింది. వారిని గూఢచారులుగా అనుమానించిన దాయాది బలగాలు.. అనంతరం ఆ దేశ పోలీసులకు అప్పగించారు.
ఇద్దరు భారతీయుల్ని అరెస్ట్ చేసిన పాక్ సైన్యం
పట్టుకున్న ఇద్దరి వ్యక్తుల నుంచి వార్తా పత్రిక, భారత కరెన్సీ నోట్లు, గుర్తింపు కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ పోలీసులు చెప్పారు. ఇరువురూ కశ్మీర్‌కు చెందిన నూర్ మహ్మద్ వాణి, ఫిరోజ్ అహ్మద్ లొనేలుగా తెలిపారు అక్కడి పోలీసులు. గూఢచర్యం కోసమే వారు పాక్‌లోకి ఆక్రమంగా ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:నేపాల్ కొత్త మ్యాపునకు ఆమోదం లాంఛనమే!