తెలంగాణ

telangana

ETV Bharat / international

సిరియాలో బాగ్దాదీ సోదరిని బంధించిన టర్కీ - తెలుగు వార్తలు ఐసిస్​ ఉగ్రవాద నాయకుడు బాగ్దాదీ సోదరి

ఇటీవల అమెరికా చేతిలో హతమైన ఐసిస్​ ఉగ్రసంస్థ​ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ సోదరి.. కుటుంబంతో సహ బందీ అయ్యింది. సిరియాలోని ఆమె నివాసంపై దాడి చేసి మరీ అదుపులోకి తీసుకుంది టర్కీ.

సిరియాలో బాగ్దాదీ సోదరిని బంధించిన టర్కీ

By

Published : Nov 5, 2019, 12:55 PM IST


ఐసిస్​ చీఫ్ అబు బకర్​ అల్​ బాగ్దాదీ సోదరి.. తమ అదుపులో ఉన్నట్లు ప్రకటించింది టర్కీ. ​ఉత్తర సిరియాలోని అజాజ్​లో నివాసముంటున్న రస్మియా​ను ప్రత్యేక ఆపరేషన్​ ద్వారా పట్టుకున్నట్లు వెల్లడించింది.

ఐసిస్​ ఉగ్రవాద సంస్థ చీఫ్​ అబు బకర్ అల్ బాగ్దాదీ అక్క అయిన రస్మియాను సోమవారం సాయంత్రం.. టర్కీ ఆపరేషన్​ దళం అధీనంలోకి తీసుకుంది. 65 ఏళ్ల రస్మియాతో పాటు ఆమె భర్త, అల్లుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఐసిస్​​ ఉగ్ర సంస్థతో రస్మియాకూ సంబంధాలు ఉన్నందున.. ఆమెను విచారిస్తే కీలకమైన విషయాలు బయటికొచ్చే అవకాశాలు ఉన్నాయి. గత వారం ఆమె అన్న బాగ్దాదీ అమెరికా చేతికి చిక్కి, తనను తాను పేల్చుకుని హతమయ్యాడు. అనంతరం.. ఐసిస్​కు కొత్త నాయకుడినీ ప్రకటించింది.

ఇదీ చూడండి:ఐఎస్​ అగ్రనేత బాగ్దాదీ హతం.. అమెరికా ప్రకటన

ABOUT THE AUTHOR

...view details