తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోర రైలు ప్రమాదం.. 16కు చేరిన మృతుల సంఖ్య

బంగ్లాదేశ్​లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. 60 మందికిపైగా గాయపడ్డారు. రైలు పెట్టెల కింద చిక్కుకున్న వారిని రక్షించేందకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఘోర రైలు ప్రమాదం.. 16కు చేరిన మృతుల సంఖ్య

By

Published : Nov 12, 2019, 1:51 PM IST

Updated : Nov 12, 2019, 5:41 PM IST

ఘోర రైలు ప్రమాదం.. 16కు చేరిన మృతుల సంఖ్య

బంగ్లాదేశ్​లో రెండు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రహ్మాన్​బరియా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉదయాన్​ ఎక్స్​ప్రెస్​- తుర్ణా నిషితా రైళ్లు మోండోభాగ్​ రైల్వేస్టేషన్​ వద్ద ఢీకొన్నాయి.

రైలు పెట్టెల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. లోకో పైలట్లు సిగ్నల్స్​ నియమాలను పాటించనందుకే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. మూడు వేర్వేరు దర్యాప్తు కమిటీలు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణను ప్రారంభించాయని స్పష్టం చేశారు.

Last Updated : Nov 12, 2019, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details