తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. పర్యటకులు, స్థానికుల తరలింపు - Ausis Fire news

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చుతోంది. వేడి గాలులతో ఆగ్నేయ ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలోని పర్యటకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. విక్టోరియా రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో దావానలం వ్యాపించి మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెనుదిరగాల్సి వచ్చింది.

tourists-firefighters-flee-as-new-heatwave-fans-australia-blaz
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు

By

Published : Dec 30, 2019, 3:57 PM IST

Updated : Dec 30, 2019, 10:52 PM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. వేడి గాలులతో ఆగ్నేయ ప్రాంతంలోని విక్టోరియా రాష్ట్రానికి మంటలు వ్యాపించాయి. అగ్ని కీలలు ఎగిసిపడుతున్న కారణంగా పర్యటకులు, అగ్నిమాపక సిబ్బంది ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రాంతానికి ఏటా సుమారు 30వేల మంది పర్యటకులు వస్తుంటారు.

విక్టోరియా రాష్ట్రంలోని తూర్పు గిప్స్​లాండ్​లో 12 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగింది. సుమారు 1000 కిలోమీటర్ల మేర ప్రాంతం అగ్నికి ఆహుతైంది. వందల మంది అగ్నిమాపక సిబ్బంది వెనుదిరగాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా అంతకంతకూ చెలరేగుతున్న కార్చిచ్చు

1000 ఇళ్లు దగ్ధం..

ఇప్పటి వరకు దావానలం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 7.4 మిలియన్ల ఎకరాలు దగ్ధమయింది. ఇది బెల్జియం విస్తీర్ణం కన్నా ఎక్కువ ప్రాంతం కావటం గమనార్హం.

47 డిగ్రీల ఉష్ణోగ్రతలు..

దేశవ్యాప్తంగా వేడిగాలులతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్​గా నమోదయ్యాయి.

పర్యటకులకు హెచ్చరికలు..

తూర్పు గిప్స్​లాండ్​లో వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న పర్యటకులకు హెచ్చరికలు చేశారు అధికారులు. కార్చిచ్చుతో రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని.. వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు.

దక్షిణ ప్రాంతాల్లోనూ..

దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాల్లోనూ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. కంగారూల ద్వీపంలో ప్రమాదకర స్థాయిలో దావానలం వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు. గాలులు వేగంగా వీస్తోన్న కారణంగా మరిన్ని ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. సౌత్​వేల్స్​లో 100కుపైగా కార్చిచ్చులను గుర్తించారు అధికారులు. సిడ్నీ సహా ప్రధాన నగరాల్లో దట్టమైన పొగమంచు అలుముకుని ఇబ్బందులకు గురిచేస్తోంది.

న్యూయిర్​ ఫైర్​వర్క్స్​కు దూరంగా రాజధాని..

దేశ రాజధాని కాన్​బెర్రాలో ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకల్లో పటాసులకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. పూర్తి స్థాయిలో ఫైర్​ బ్యాన్​ ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాన్​బెర్రాతో పాటు సమీప నగరాలు ఇదే దారిలో నడుస్తున్నాయి. సిడ్నీలో న్యూయిర్​ ఫైర్​వర్స్క్​ను నిషేధించి ఆ డబ్బును కార్చిచ్చు అదుపు చేసేందుకు వినియోగించాలని 2.7 లక్షల మంది సంతకాలు చేసిన పిటిషన్​ దాఖలు చేశారు. కానీ.. వేడుకలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. సిడ్నీ నగరం ప్రతిఏటా ఫైర్​వర్క్స్​ కోసం 4.5 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది.

ఇదీ చూడండి: మైక్​ టైసన్​, మహ్మద్​ అలీకి శిక్షణ ఇచ్చిన జిమ్ ఇదే...

Last Updated : Dec 30, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details