తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా శీతాకాల అందాలకు పర్యటకులు ఫిదా - కెకెటోహోయి

చైనా కెకెటోహోయి... భారీగా కురుస్తున్న మంచుతో భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఇక్కడకు విచ్చేసే పర్యటకుల కోసం.. సరికొత్త అనుభూతిని పంచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫుయున్​లోని ఓ రిసార్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tourists are flocking to the Keketuohai scenic area of northwest China's Xinjiang Uygur Autonomous Region
పర్యటకులను కట్టిపడేస్తున్న చైనా శీతాకాల అందాలు

By

Published : Dec 13, 2020, 5:26 PM IST

పర్యటకులను కట్టిపడేస్తున్న చైనా శీతాకాల అందాలు

వాయవ్య చైనా షింజియాంగ్ రాష్ట్రంలోని​ కెకెటోహోయి మంచు దుప్పటి కప్పుకుంది. శ్వేతవర్ణంలో ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. వీటిని వీక్షించడానికి, పర్యటకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. సాంస్కృతిక అంశాలను మేళవించి పర్యటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెకెటోహోయిలోని ఫుయున్​ కౌంటీలో ఓ రిసార్టులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.

"ఎత్తైన ప్రదేశంలో ఈ రిసార్టు ఉండటం వల్ల ఎక్కువగా మంచు కురుస్తోంది. మిగతా రిసార్టుల్లాగా ఇక్కడ కృత్రిమమైన మంచు లేదు. స్కేటింగ్​కు చాలా అనువుగా ఉంది."

--పర్యటకుడు

స్కీయింగ్​ చేస్తున్న పర్యటకులు
రంగురంగుల లైట్లతో వెలిగిపోతున్న ఫుయున్​ రిసార్టు
రిసార్టులో చైనా సంప్రదాయ ఆహారం
హస్తకళల ప్రదర్శన

ఇదీ చూడండి:3 రోజుల్లో భూమిపైకి చంద్రుడి నమూనాలు!

ABOUT THE AUTHOR

...view details