తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ విషయంపై అమెరికా, రష్యా, చైనా చర్చలు! - UN GLOBAL COOPERATION

ప్రపంచదేశాల మధ్య సహకారం బలోపేతం చేసేందుకు త్వరలో భద్రతా మండలి సమావేశం నిర్వహించనుంది చైనా. ఇందులో పాల్గొనేందుకు రష్యా, అమెరికా సహా మొత్తం 14 దేశాలను ఆహ్వానించింది.

US CHINA RUSSIA
త్వరలో ఒకే వేదికపై అమెరికా, రష్యా, చైనా

By

Published : May 7, 2021, 11:57 AM IST

అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతమే లక్ష్యంగా ఏర్పాటు చేసే భద్రతా మండలి సమావేశం త్వరలో జరగనుంది. ఇందులో చైనా, అమెరికా, రష్యా అధికారులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. భద్రతా మండలికి మే నెలలో నేతృత్వం వహిస్తున్న చైనా.. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. బహుళపక్ష విధానాలకు కట్టుబడి ఉంటాయని భద్రతా మండలిలోని 15 దేశాలు కట్టుబడి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపింది.

వర్చువల్​గా జరిగే ఈ సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అధ్యక్షత వహించనున్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లావ్​రోవ్​లు ఇందులో భాగం కానున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది.

ఈ భేటీకి బ్లింకెన్ హాజరయ్యే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. బహుళపక్ష సహకారం ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడతారని తెలిపింది.

ఇదీ చదవండి:'కొవిడ్​పై పోరులో​ సాయం కోసం వారిని అనుమతించండి'​

ABOUT THE AUTHOR

...view details