మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్.. ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మక అవార్డులు ఇవి. ఈ పోటీల్లో గెలుపొందాలంటే.. కేవలం అందం ఒక్కటే కొలమానం కాదు. ఆయా పోటీల్లో అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు.. కిరీటానికి చేరువ చేస్తాయి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. మరి కొందరు విశ్వసుందరీ మణులు ఎదుర్కొన్న ప్రశ్నలు.. వాటికి వారు ఇచ్చిన సమాధానాలేంటో చూసేయండి...
సుస్మితా సేన్, భారత్
ప్రపంచ సుందరి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓ సందర్భంలో 'భారత్‌లో ప్రేమ అనేది జీవితంతో సమానం' అని సుస్మితా సేన్ అన్నారు. అలా ఎందుకన్నారని జ్యూరీ అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పారు. ఆ సమాధానమే.. సుస్మితకు కిరీటం దక్కేలా చేసింది.
"భారత్‌లో బహుళజాతి ప్రజలుంటారని అందరికి తెలుసు. ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఉన్నాయి. అయినా ప్రజలు కలిసి జీవిస్తారు. శాంతియుతంగా ఉంటారు. అనేక మతాల వారు కలిసి జీవిస్తున్నప్పటికీ శాంతియుతంగా ఉండటం చాలా కష్టం. అది ప్రేమతోనే సాధ్యం. అందుకే భారత్‌లో ప్రేమ అనేది జీవితంతో సమానం అని నేను అన్నాను."
-- సుస్మితా సేన్, మిస్ యూనివర్స్- 1994
జోజిబిని తుంజి, దక్షిణాఫ్రికా
'నేటి తరం అమ్మాయిలకు ఏం నేర్పించాలి?' అని జ్యూరీ అడగ్గా.. తుంజి చెప్పిన సమాధానం అందరి మనసును దోచుకుంది.
"నా దృష్టిలో.. ఈ తరం అమ్మాయిలకు నాయకత్వం గురించి నేర్పించాలి. ఎంతో కాలంగా మహిళల్లో నాయకత్వం లోపించింది. మనం నాయకత్వం చేయలేక కాదు. సమాజం మహిళలను అలా చిత్రీకరించడమే కారణం. నాకు తెలిసి.. మహిళలు ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వారు. నేటి తరం అమ్మాయిలకు అది నేర్పించాలి. సమాజంలో మనకంటూ ఓ స్థానాన్ని నిర్మించుకోవడం ఎంతో ముఖ్యం."
--- జోజిబిని తుంజి, మిస్ యూనివర్స్- 2019
ఐశ్వర్య రాయ్, భారత్
'మిస్ వరల్డ్ 1994గా నిలవడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?' అని ఐశ్వర్య రాయ్‌ను అడిగింది జ్యూరీ. దానికి ఐష్ చెప్పిన సమాధానం.. ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది.
"ఇప్పటివరకు మిస్ వరల్డ్ అయినవారు.. తమలో కరుణ అనే భావానికి ప్రతీకగా నిలిచారు. అణగారిన వారిపట్ల కరుణతో ఉన్నారు. మనపై మనిషి ప్రయోగించిన ఆంక్షలు, జాతి, రంగుకు మించి చూశారు. వీటన్నింటికీ మించి మనం ముందుకు చూడాలి. అదే నిజమైన మిస్ వరల్డ్‌గా మన్నల్ని తీర్చిదిద్దుతుంది. ఎ ట్రూ పర్సన్.. ఎ రియల్ పర్సన్."
--- ఐశ్వర్య రాయ్, మిస్ వరల్డ్ 1994
వనెస్సా పోన్సే, మెక్సికో
'మీ పలుకుబడిని ఉపయోగించుకుని ప్రపంచానికి ఎలా సాయం చేస్తారు?' అని అడగ్గా.. పోన్సే ఈ విధంగా సమాధానం చెప్పారు. జ్యూరీ మన్ననలు పొంది.. ప్రపంచ సుందరిగా నిలిచారు.
"గత మూడేళ్లుగా చేస్తున్నట్టుగానే ఇప్పుడూ నా స్థాయిని ఉపయోగించుకుంటాను. ఆదర్శంగా నిలుస్తాను. ఈ ప్రపంచంలో.. మనం అందరం మంచికి చిహ్నంగా ఉండొచ్చు. అందరిని పట్టించుకోవాలి.. ప్రేమించాలి. ఇలా ఉండటం వల్ల అదనంగా ఖర్చు అవ్వదు. సహాయం చేయడం అంత కష్టమైనది కూడా కాదు. మార్పు తీసుకురావాలన్న ఆశయం ఉండాలి. మీరు ఇవ్వగలిగేది స్వీకరించేందుకు ఎవరో ఒకరు ఉంటారు. అందువల్ల.. ఎవరికైనా, ఏ విధంగానైనా సహాయం చేయండి."
--- వనెస్సా పోన్సే, మిస్ వరల్డ్- 2018
డయనా హైడెన్, భారత్
'మీరు మిస్ వరల్డ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు' అని డయానాను అడిగింది జ్యూరీ. అడిగారు. దానికి డయానా చెప్పిన