అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన కారు బాంబు పేలుడులో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలయ్యాయి. కాబూల్‌లో పలు అంతర్జాతీయ సంస్థలు ఉండే గ్రీన్ విలేజ్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. తాలిబన్లతో చర్చలు జరుపుతున్న అమెరికా దౌత్య రాయబారి జల్మాయ్ ఖలిజాద్...... స్థానిక మీడియాతో మాట్లాడుతుండగా దుర్ఘటన జరిగింది.
అఫ్గాన్‌లో కారు బాంబుదాడి- 16మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన కారుబాంబు పేలుడులో 16మంది మృతి చెందారు. 119 మంది గాయపడ్డారు. తాలిబన్లతో అమెరికా రాయబారి చర్చలు జరుపుతుండగానే ఈ దాడి జరిగింది.
అఫ్గాన్‌లో కారు బాంబుదాడి-16మంది మృతి
పేలుడు తర్వాత కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ 'తాలిబన్' ప్రకటించింది.
ఇదీ చూడండి: కశ్మీర్ రగడ: మాల్దీవులు వేదికగా పాక్‌కు భంగపాటు
Last Updated : Sep 29, 2019, 6:26 AM IST