సమ్మర్ ఒలింపిక్స్‌కు మరికొద్ది రోజులు ఉందనగా.. జపాన్‌లోని టోక్యోలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్కరోజులో 950 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు నెలలకాలంలో ఒక్కరోజు ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఈ స్థాయిలో కొవిడ్ వ్యాప్తి చెందడం ఒలింపిక్ నిర్వాహకులను కలవరపెడుతోంది.
ప్రపంచస్థాయి ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కరోనా ప్రబలకుండా ఉండేందుకు గాను అక్కడి ప్రధాని యోషిహిదే సుగా.. గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి రానుండగా.. పెద్ద సంఖ్యలో కరోనా కొత్త కేసులు వెలుగు చూడడం ఇటు క్రీడాకారులను, నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ఈసారి ఫ్యాన్స్ లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది జపాన్ ప్రభుత్వం.
రష్యాలో పెరుగుతున్న మరణాలు...