నేపాల్‌లో సముద్రమట్టానికి 3,000 మీటర్ల కంటే ఎత్తైన ప్రాంతంలో మొదటిసారి బెంగాల్ టైగర్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని నేపాల్‌కు చెందిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం, అటవీ శాఖ, జాతీయ ఉద్యానవనాల శాఖలు తెలిపాయి. వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయని ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ పులిని హిమాలయాల్లో గుర్తించడం వల్ల ప్రాధాన్యం ఏర్పడింది.
"అరుదైన రాయల్ బెంగాల్ టైగర్.. తూర్పు నేపాల్ ఇల్లమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కింది. 3,165 మీటర్ల ఎత్తులో ఈ పులి కనిపించింది. దేశంలోని తూర్పు కొండ ప్రాంతాల్లో పులులు ఉన్నాయనడానికి ఈ ఫొటో మెదటి సాక్ష్యంగా నిలిచింది."
-- నేపాల్ అటవీ &వన్యప్రాణుల సంరక్షణ, జాతీయ ఉద్యానవన శాఖ
మొదటిసారి ఈ పులి జాడ కనిపించిన నేపథ్యంలో.. అదే ప్రాంతంలో 'లింక్సెస్'(పెద్ద పిల్లులు)ను గుర్తించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని నేపాల్ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, జాతీయ ఉద్యానవన శాఖలు తెలిపాయి.