చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా భారత సైన్యం, ప్రభుత్వంపై టిబెట్ యువజన కాంగ్రెస్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణను స్వాగతించారు. అయితే చైనాను నమ్మలేమని.. భారత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
"చైనా దళాలు రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గాయి. ఈ విషయంపై భారత్‌ను ప్రశంసించాలి. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. చైనా మళ్లీ చొరబడవచ్చు. అందుకే చైనాతో జాగ్రత్తగా ఉండాలి. భారత్-చైనా మధ్య టిబెట్ సమస్యాత్మక ప్రాంతాంగా ఉన్నంత కాలం ఈ వ్యవహారానికి పరిష్కారం లభించదు."