తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇంజిన్​లో సమస్య వల్లే ఆ విమాన ప్రమాదం' - ఇండోనేసియా

ఇండోనేసియాలో జనవరి 9న జరిగిన విమాన ప్రమాదానికి ఇంజిన్​లో సమస్యే కారణమని అధికారులు తెలిపారు. ఇంజిన్​లోకి వెళ్లే ఇంధనాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు.

Investigators: Throttle problem suspected in Indonesia crash
'ఇంజన్​లో సమస్య వల్లే ఆ విమానం కూలింది'

By

Published : Feb 10, 2021, 3:39 PM IST

ఇండోనేసియాలో జనవరి 9న జరిగిన విమాన ప్రమాదానికికారణాలను దేశీయ రవాణా రక్షణ కమిటీ అధికారులు వెల్లడించారు. ఇంజిన్​లోకి వచ్చే ఇంధనాన్ని నియంత్రించే భాగం పని చేయకపోవడం వల్ల విమానాన్ని పైలెట్లు అదుపు చేయలేకపోయారని, అందువల్లే అదిసముద్రంలో కూలినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే పూర్తి కారణాలు మాత్రం అర్థం కావట్లేదని తెలిపారు.

'శ్రీవిజయ ఎయిర్‌'కు చెందిన బోయింగ్ 737 విమానం మొత్తం 62మంది ప్రయాణికులతో జనవరి 9 శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం 2:36 నిమిషాలకు టేకాఫ్‌ అయింది. కొద్ది సేపటికే ఉన్నట్టుండి కిందకు పడిపోవటం మొదలై.. 21 సెకన్లలోనే జావా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 62 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:జావా సముద్రంలో ఇండోనేసియా విమాన శకలాలు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details