తెలంగాణ

telangana

ETV Bharat / international

సెక్యూరిటీ గార్డ్​కు డ్యూటీ ఫస్ట్ రోజే బోర్​.. రూ.కోట్ల పెయింటింగ్ ఫసక్!

Three Figures Painting: బోర్ కొట్టిందని ఓ సెక్యూరిటీ గార్డ్‌ చేసిన ఘనకార్యం.. మొదటి రోజే తన ఉద్యోగాన్ని ఊడగొట్టింది. గ్యాలరీలో ఉంచిన కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్‌ను రక్షించాల్సిన వ్యక్తి.. దానిపై పెన్నుతో గీతలు గీసి నిర్వాహకులు ఆగ్రహానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..

Three Figures Painting
Three Figures Painting

By

Published : Feb 11, 2022, 11:56 AM IST

Updated : Feb 11, 2022, 1:21 PM IST

Three Figures Painting: రష్యాలోని బోరిస్ ఎల్ట్సిన్ ప్రెసిడెన్షియల్ సెంటర్‌లో ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా విధుల్లో చేరాడు. అక్కడి ఆస్తుల్ని రక్షించాల్సిన ఆ వ్యక్తికి మొదటిరోజే విసుగ్గా అనిపించింది. దాంతో అక్కడ ప్రదర్శనలో ఉన్న 'త్రీ ఫిగర్స్‌' పెయింటింగ్‌పై తన విసుగును ప్రదర్శించాడు. ఆ పెయింటింగ్‌లో ఉన్న మూడు చిత్రాలకు ముఖాకృతి ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ గార్డ్ అందులోని రెండు ముఖాలపై తన బాల్‌పాయింట్‌ పెన్నుతో కళ్లు గీశాడు. 2021 డిసెంబరు 7న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన కొందరు ఈ మార్పును గుర్తించి, నిర్వాహకులకు తెలియజేశారు. ఆ పని చేసింది ఎవరో తెలుసుకున్న యాజమాన్యం.. అతడిని విధుల్ని తొలగించింది.

అన్నా లెపోర్స్కాయ 'త్రీ ఫిగర్స్‌' పేరిట ఈ కళాఖండాన్ని సృష్టించారు. ఈ కళాఖండం వాస్తవ ధరపై స్పష్టత లేదు కానీ.. దీని పేరిట రూ.7.51 కోట్ల విలువైన బీమా ఉంది. కాగా, ఆ పెయింటింగ్‌పై పెన్నుతో బలంగా గీయకపోవడంతో.. పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే దానికి పూర్వ రూపం తెచ్చేందుకు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:అమ్మాయి పుడుతుందని డౌట్.. అబ్బాయిలా మార్చేస్తానని గర్భవతి తలకు మేకు!

Last Updated : Feb 11, 2022, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details