అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు- ముగ్గురు మృతి - kabul explosion news
14:25 September 18
అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు-ముగ్గురు మృతి
వరుస పేలుళ్లతో అఫ్గానిస్థాన్ దద్దరిల్లింది. నంగార్హర్(Nangarhar Taliban) ప్రాంతంలోని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో(Nangarhar Explosion) ముగ్గురు మృతిచెందగా.. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారన్న విషయంపై ప్రస్తుతానికి సమాచారం లేదు. అయితే తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా.. వారే ఈ దాడులకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు దేశ రాజధాని కాబుల్‌లోనూ(Kabul Explosion News) శనివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దురు గాయపడ్డారు.