తెలంగాణ

telangana

ETV Bharat / international

చేతిలో పేలిన గ్రెనేడ్​- ముగ్గురు చిన్నారులు బలి

ప్రమాదవశాత్తు గ్రెనేడ్​ పేలి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్​లో జరిగింది.

grenade blast in Pakistan
గ్రనేడ్​ ప్రమాదం

By

Published : Jul 2, 2021, 5:50 PM IST

Updated : Jul 3, 2021, 8:37 AM IST

నిషేధిత చేతి గ్రెనేడ్​తో ఆడుకుంటుండగా.. అది పేలి శుక్రవారం ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్​లోని సమస్యాత్మక ఖైబర్​ పఖ్తుంఖ్వాలో జరిగింది. రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదం జరగడం నెల తిరక్కుండానే ఇది రెండోది.

ఎలా జరిగిందంటే..

నస్రన్​ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో చిన్నారులకు గ్రనేడ్ దొరికింది. ఆటవస్తువుగా భావించి దానిని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం దానితో ఆడుకుంటుండగా పేలి ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇంకా ముప్పులోనే..

పాకిస్థాన్​లోని ఆదివాసీ జిల్లాలో కొన్నేళ్లుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తోటలు, బహిరంగ ప్రదేశాల్లో పేలుడు పదార్ధాలు అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంటాయి. జూన్​ 3న కూడా దక్షిణ వాజీరిస్థాన్​లో ఆడుకుంటుండగా గ్రెనేడ్​ పేలి ముగ్గురు పిల్లలు మృతిచెందారు.

ఇదీ చూడండి:లైవ్ వీడియో: ఉగ్రవాదుల గ్రనేడ్​ దాడి- ఒకరు మృతి

Last Updated : Jul 3, 2021, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details