తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై పెల్లుబికిన ప్రజాగ్రహం

ఆస్ట్రేలియా వ్యాప్తంగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. వేల ఇళ్లు, వందల హెక్టార్ల భూభాగం దగ్ధమయింది. కార్చిచ్చుపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. ఆందోళనబాటపట్టారు ప్రజలు. ప్రధాని స్కాట్​ మోరిసన్​కు వ్యతిరేకంగా సిడ్నీ నగరంలో ర్యాలీ నిర్వహించారు. వాతావరణ మార్పులపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

wild fire
ఆస్ట్రేలియా కార్చిచ్చుపై పెల్లుబికిన ప్రజాగ్రహం

By

Published : Jan 10, 2020, 8:33 PM IST

అడవులను కాల్చేసి, వేలాది జంతువుల మృతికి కారణమైన కార్చిచ్చుపై ఆస్ట్రేలియా వాసుల ఆగ్రహం పెల్లుబికింది. సిడ్నీ నగరం వీధుల్లోకి ప్రజలు వేల సంఖ్యలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలని.. కార్చిచ్చు సంక్షోభంపై ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ స్పందించాలని కోరుతూ నినాదాలు చేశారు. న్యూసౌత్ వేల్స్​ లోని టౌన్​హాల్​ నుంచి పార్లమెంట్​ భవనం వరకు ర్యాలీ తీశారు.

జంతువుల రక్షణ కోసం..

దక్షిణ ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలోని వన్యప్రాణి ఉద్యానవాన్ని గాయపడిన జంతువులను కాపాడేందుకు వినియోగిస్తున్నాడు యజమాని సామ్ మిషెల్. కోలాలు, కంగారులు వంటి గాయపడిన అనేక జంతువులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నాడు. డిసెంబర్​ నుంచి ఇప్పటి వరకు 25వేల కోలాలు మృతి చెందాయి. లక్షా 70వేల ఎకరాల అడవి దగ్ధమైంది.

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై పెల్లుబికిన ప్రజాగ్రహం

ఇదీ చూడండి: భగ్గుమన్న అగ్నిపర్వతం.. ఆకాశాన్ని తాకేలా ఎగసిన లావా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details