తెలంగాణ

telangana

ETV Bharat / international

ముస్లింల ప్రార్థనలతో కిక్కిరిసిన టర్కీ వీధులు - Turkey latest

టర్కీలోని ఇస్తాంబుల్​, హాజియా సోఫియాలో 86ఏళ్ల తర్వాత ప్రార్థనా వేడుకలను ఘనంగా నిర్వహించారు ముస్లింలు. ఈ వేడుకల ప్రారంభోత్సవంలో ఆ దేశాధ్యక్షుడు రెసెప్​ తయ్యిప్​ ఎర్డొగాన్​ పాల్గొన్నారు.

Thousands of Muslim faithful made their way to Istanbul's landmark Hagia Sophia on Friday
టర్కీ ప్రార్థనల్లో భారీ స్థాయిలో పాల్గొన్న ముస్లింలు

By

Published : Jul 24, 2020, 11:21 PM IST

టర్కీ- ఇస్తాంబుల్​లోని హాజియా సోఫియాలో నిర్వహించిన ప్రార్థనల్లో వేలాదిమంది ముస్లింలు పాల్గొన్నారు. 86ఏళ్లపాటు క్రైస్తవ మతాలకు నిలయమైన ఈ కేథడ్రల్​లను.. ముస్లింలు ఇటీవలికాలంలో మసీదులు, మ్యూజియంలుగా మార్చారు.

టర్కీ ప్రార్థనల్లో భారీ స్థాయిలో పాల్గొన్న ముస్లింలు

భారీ స్థాయిలో నిర్వహించిన ఈ నమాజ్ ప్రారంభ వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడు రెసెప్​ తయ్యిప్​ ఎర్డొగాన్​ పాల్గొన్నారు. ఆరో శతాబ్దానికి చెందిన ఓ చారిత్రక మసీదులో సుమారు 500మందితో కలిసి ప్రార్థనలు చేశారు ఎర్డోగాన్​. ఈ సందర్భంగా టర్కీ ఇస్లామిక్​ ఉద్యమంలో యువత కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్​

తొలిసారిగా నిర్వహించిన ఈ ప్రార్థనల్లో పురుషులతో సహా మహిళలు పాల్గొన్నారు. ఫలితంగా సోఫియా ప్రాంతమంతా ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది.

టర్కీ ప్రార్థనల్లో భారీ స్థాయిలో పాల్గొన్న ముస్లింలు
టర్కీ ప్రార్థనల్లో భారీ స్థాయిలో పాల్గొన్న ముస్లింలు

ఇదీ చదవండి:'కరోనా కుట్ర'పై బిల్​గేట్స్​ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details