తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ యుద్ధంలో గల్లంతైన వారంతా మరణించారు'

ఎల్​టీటీఈతో జరిగిన యుద్ధంలో గల్లంతైన దాదాపు 20వేల మంది మరణించారని ప్రకటించారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. మరణ ధ్రువీకరణ పత్రాలు అందించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడించారు.

By

Published : Jan 21, 2020, 9:40 PM IST

Updated : Feb 17, 2020, 10:09 PM IST

thousands-of-missing-persons-during-lankas-civil-war-are-dead-president-gotabaya-rajapaksa
'ఆ యుద్ధంలో గల్లంతైన వారంతా మరణించారు'

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్​టీటీఈ)తో జరిగిన భీకర యుద్ధంపై శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తొలిసారి స్పందించారు. పదేళ్ల క్రితం జరిగిన యుద్ధంలో గల్లంతైన దాదాపు 20వేల మంది మరణించినట్టు అంగీకరించారు.

దర్యాప్తు ముగిసిన అనంతరం గల్లంతైన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని యూఎన్​ రెసిడెంట్​ కోఆర్డినేటర్​ హనా సింగర్​కు అధ్యక్షుడు స్పష్టం చేసినట్టు ప్రముఖ వార్తా పత్రిక ది కొలంబో గెజిట్​ పేర్కొంది.

మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని రాజపక్స తెలిపినట్టు అధ్యక్షుడి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

"మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అనంతరం వారి కుటుంబాలకు అండగా ఉంటాం. తగిన సహాయం చేస్తాం. అయితే తమిళ రాజకీయ నేతలకు ఇది నచ్చకపోవచ్చు. కానీ బాధిత కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది."
--- అధ్యక్షుడి కార్యాలయం.

తమిళులతో 30ఏళ్ల పాటు సాగిన పౌర యుద్ధాన్ని తెరదించిన వీరుడిగా గొటబాయకు పేరుంది. ఎల్​టీటీఈతో యుద్ధంలో తమిళుల మరణాలు, తమిళ కుటుంబాలు అదృశ్యం కావటం వంటివి ఈ మాజీ రక్షణ కార్యదర్శిపై ఉన్న ఆరోపణలు.

ఉత్తర-ఈశాన్య లంకలో తమిళులపై జరిగిన యుద్ధంలో లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో పాటు అనేక గొడవల్లో దాదాపు 20వేల మందికిపైగా ప్రజలు గల్లంతైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

2009లో ఎల్​టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్​ను ప్రభుత్వ దళాలు మట్టికరిపించిన సమయంలో వేలాది మందిపై హత్య జరిగినట్టు తమిళులు ఆరోపించారు. వీటిని ప్రభుత్వం ఖండించింది.

Last Updated : Feb 17, 2020, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details