కళ్లముందే తల్లి మరణయాతన పడుతుంటే అతని మనసు తల్లడిల్లిపోయింది. దగ్గరకు వెళ్లి అమ్మా నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పాలనిపించింది. కానీ ఆమెకు సోకింది కొవిడ్ మహమ్మారి. రోజురోజుకూ కబళించి వేస్తోంది. ఆస్పత్రిలోకి వెళ్లి చూడడానికి వీల్లేదు.
లోపల అమ్మ మరణయాతన.. బయట బిడ్డ వేదన! - son sitting beside window for mom in palastina
కిటికీ ఎక్కి.. 'అమ్మా నీకు నేనున్నా' అని ధైర్యం చెప్పడం తప్ప గుండెలకు హత్తుకుని తల్లిని ఓదార్చలేని పరిస్థితి తనయుడిది. కడసారి కన్న బిడ్డను ముద్దాడలేని దీనస్థితి ఆ తల్లిది. పాలస్తీనాకు చెందిన ఆ తల్లి-కుమారుడి వేదనకు అద్దం పట్టే ఓ ఫొటోను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి సామాజికమాధ్యమాల్లో పంచుకున్నారు.
లోపల అమ్మ మరణయాతన.. బయట బిడ్డ వేదన!
దీంతో ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోక ఇలా ప్రతి రోజు ఆమెను ఉంచిన గది కిటికీపైకి ఎక్కి కూర్చొని చూసేవాడు. ఆమె మరణించే వరకూ ఇలాగే చూసుకున్నాడు. పాలస్తీనాకు చెందిన తల్లిని కాపాడుకోలేక తల్లడిల్లిన తనయుడి నిస్సహాయతను తెలియజేస్తున్న ఈ ఫొటోను ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఇదీ చదవండి: ఆటోలో కాన్పు- గర్భంలోనే శిశువు మృతి
Last Updated : Jul 21, 2020, 10:34 AM IST