మలేషియా రాజధాని కౌలాలంపుర్ నేషనల్ జూ పార్కులో గురువారం రెండో చిన్ని పాండా జన్మించింది. పాండా బేబికి 'యి యి' అని పేరు పెట్టారు. 'యి యి' అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. ఎంతో ముద్దుగొలిపే పాండా చేష్టలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మలేషియా జూ పార్కులో ఫ్రెండ్షిప్ 'పాండా' - యి యి
మలేషియాలోని ఓ నేషనల్ జూ పార్కులో గురువారం రెండో పాండా జన్మించింది. పాండా బేబికి 'యి యి' అని పేరు పెట్టారు అధికారులు. ఈ చిట్టి పాంటా తన ముద్దు ముద్దు చేష్టలతో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
మలేషియా జూ పార్కులో ఫ్రెండ్షిప్ 'పాండా'
గతేడాది జనవరి 14న ఒక పాండా జన్మించింది. తాజాగా యి యి చిట్టి పాండా పుట్టింది. ప్రస్తుతం రెండింటని ఒకే చోట ఉంచారు.
'జియాంట్ పాండా ఇంటర్నేషనల్ కన్జర్వేటివ్ ప్రాజెక్టు'లో భాగంగా జూ పార్కులో పలు పాండాలను పరిరక్షిస్తోంది చైనా. మలేషియా-చైనా మధ్య 40 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సత్సంబంధాలకు గుర్తుగా ఈ ప్రాజెక్ట్ ఏర్పడింది.
Last Updated : Aug 2, 2019, 12:19 PM IST