అఫ్గాన్‌ను గడగడలాడించే తాలిబన్లు.. ఇస్లామిక్ స్టేట్ పేరు వింటేనే వణికిపోతున్నారు!(taliban isis news) వరుస బాంబు దాడులతో తాలిబన్లకు తలనొప్పిగా మారింది ఇస్లామిక్ స్టేట్. ముఖ్యంగా తాలిబన్లే లక్ష్యంగా వారి వాహనాలపై దాడులకు తెగబడుతోంది(taliban isis difference).
తూర్పు అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో శని, ఆదివారాల్లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా దాడులు జరిగాయి(islamic state afghanistan). ఇందులో 8 మంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని.. ఇస్లామిక్ స్టేట్ బృందం తన అధికార మీడియా ఆమక్ న్యూస్ ద్వారా ప్రకటించింది.
అనాదిగా.. శత్రుత్వం!
తాలిబన్- ఇస్లామిక్ స్టేట్ మధ్య శత్రుత్వం కొత్తేమీ కాదు. అమెరికా దళాలు వెనుదిరగక ముందు నుంచే వీరి మధ్య వైర్యం ఉంది. రెండు వర్గాలు కఠిన ఇస్లాం నిబంధనలు పాటిస్తాయి. కానీ వీరి సిద్ధాంతాల్లో కొంత వ్యత్యాసం ఉంది. అఫ్గానిస్థాన్‌పై పట్టు కోసం తాలిబన్లు ఇన్నేళ్లు శ్రమించగా.. అంతర్జాతీయంగా 'జిహాద్' కోసం ఐఎస్ పిలుపునిచ్చింది.