తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాను లెక్కచేయని చైనా.. పర్యటక ప్రాంతాలు కిటకిట - the famous cherry blossom as tourist sites reopened amid a sharp fall in the number of new coronavirus cases.

చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పలు రెస్టారెంట్లు, పర్యటక ప్రాంతాలను తిరిగి ప్రారంభిస్తున్నారు అక్కడి అధికారులు. తాజాగా బీజింగ్​లోని ప్రముఖ పర్యటక ప్రాంతం యుయువాంటన్ పార్క్ సహా మరికొన్ని చోట్ల సందర్శకులను అనుమతించారు. ఆయా ప్రాంతాల్లో చెర్రీ పూలు వికసించి.. అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

the famous cherry blossom as tourist sites reopened amid a sharp fall in the number of new coronavirus cases.
బీజింగ్​లో రెండు నెలల తర్వాత తెరుచుకున్న పర్యటక ప్రాంతాలు

By

Published : Mar 26, 2020, 6:57 PM IST

కరోనా వైరస్​ చైనాను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ప్రభావంతో దాదాపు రెండు నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు చైనా వాసులు. ప్రస్తుతం ప్రపంచం కరోనాతో అవస్థలు పడుతుంటే చైనాలో మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీజింగ్​లోని పర్యటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తున్నారు అధికారులు. చెర్రీ పూలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ యుయువాంటన్ పార్క్​ ప్రస్తుతం రకరకాల పూల అందాలతో శోభిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.

షరతులు...

అయితే పర్యటక ప్రాంతాలకు వెళ్లాలంటే కొన్ని షరతులు పెట్టింది ప్రభుత్వం. యుయువాంటన్ పార్క్​ను సందర్శించాలంటే ఒక్కరోజు ముందుగానే ఆన్​లైన్​లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్​ 15 వరకు మాత్రమే టిక్కెట్లను అందుబాటులో ఉంచిన అధికారులు 30 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఆయా ప్రాంతాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్​లను విధిగా ధరించాలని, ఒకచోట ఎక్కువమంది గుమికూడదని షరతులు పెట్టారు.

బీజింగ్​లో తెరుచున్న పర్యటక ప్రాంతాలు

ఇదీ చూడండి:కరోనా సెలవుల్లో టైమ్​పాస్​ కోసం ఉచితంగా పుస్తకాలు

ABOUT THE AUTHOR

...view details