తెలంగాణ

telangana

ETV Bharat / international

కళ్లు జిగేలుమనేలా 'ఆసియా కల్చరల్​' కార్నివాల్​

చైనాలో జరుగుతోన్న 'కాన్ఫరెన్స్​ ఆన్​ డైలాగ్​ ఆఫ్​ ఆసియా సివిలైజేషన్​' సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఆసియా కల్చరల్​ కార్నివాల్​కు విశేష ఆధరణ లభిస్తోంది. వివిధ దేశాల నుంచి హాజరైన 8 వేల మంది కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. కళ్లు చెదిరే విద్యుత్​ కాంతుల​తో సుమారు 15 వేల చదరపు మీటర్ల మేర ప్రత్యేకంగా నిర్మించిన వేదికకు గిన్నీస్​ వరల్డ్​ రికార్డు దక్కింది.

By

Published : May 18, 2019, 5:02 AM IST

కళ్లు జిగేలుమనేలా 'ఆసియా కల్చరల్​' కార్నివాల్​

కళ్లు జిగేలుమనేలా 'ఆసియా కల్చరల్​' కార్నివాల్​

'కాన్ఫరెన్స్​ ఆన్​ డైలాగ్​ ఆఫ్​ ఆసియా సివిలైజేషన్​' (సీడీఏసీ) సదస్సుకు చైనా వేదికైంది. ఆసియాలోని వివిధ నాగరికతల మధ్య పరస్పర ప్రోత్సాహం, భవిష్యత్తు సమాజ నిర్మాణంలో భాగస్వామ్యంపై అవగాన కల్పించటమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మే 22 వరకు సీడీఏసీ సదస్సు జరగనుంది.

సీడీఏసీలో భాగంగా చైనా రాజధాని బీజింగ్​లో 'ఆసియా కల్చరల్​' కార్నివాల్​ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. 'సెలబ్రేషన్​ ఆఫ్​ యూత్​, డ్రీమ్​ ఆఫ్​ ఆసియా' అనే థీమ్​తో నిర్వహిస్తున్న కార్నివాల్​కు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి దాదాపు 8 వేల మంది కళాకారులు హాజరయ్యారు. తమ ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. విద్యుత్​ కాంతులతో బీజింగ్​ బర్డ్స్​ నెస్ట్​ జాతీయ మైదానం మెరిసిపోతోంది.

ఆరు నెలల ముందు నుంచే..

కార్నివాల్​ నిర్వహించేందుకు ఆరు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభించింది చైనా. కార్నివాల్​ కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్​ చేపట్టారు.

గిన్నీస్​ రికార్డు...

కార్నివాల్​ కోసం ప్రత్యేకంగా సుమారు 15వేల చదరపు మీటర్లతో వేదికను నిర్మించారు. ప్రపంచంలో ఏ స్టేడియంలోనూ ఇంత పెద్ద వేదిక లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇందులో భారీ 3డీ ఎల్​ఈడీ లైట్​ మాట్రిక్స్​ సిస్టమ్స్​ ఏర్పాటు చేశారు. సుమారు 2500 రకాల ఎల్​ఈడీ కాంతుల​తో ఏర్పాటు చేసిన ఈ వేదికకు గిన్నీస్​ వరల్డ్​ రికార్డు దక్కింది.

ఇదీ చూడండి:గ్రీన్​కార్డు కాదు... ఇకపై 'బిల్డ్ అమెరికా' వీసా

ABOUT THE AUTHOR

...view details