మాజీ ప్రియుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది థాయ్‌లాండ్‌కు చెందిన 36 ఏళ్ల ఓ మహిళ. పక్కా స్కెచ్ వేసింది. అతడు.. పార్క్ చేసిన బైక్‌ను తగలపెట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే.. ఆ బైక్ ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అక్షరాలా 23 లక్షల రూపాయలు.
తనకు ప్రియుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఖరీదైన బైక్ అది. బ్రేకప్ అయ్యాక మళ్లీ తనకు అతడు బైక్ తిరిగివ్వలేదన్న కోపంతో పెట్రోల్ పోసి నిప్పు అంటించింది ఆ మహిళ.
ఎలా చేసిందంటే?
బ్యాంకాక్‌లో తన మాజీ ప్రియుడు పనిచేసేచోటుకు కారులో వచ్చింది ఆమె. మెల్లగా.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆ బైక్‌పై పోసి తగలబెట్టింది. ఆమెకు కూడా మంటలు అంటుకున్నా అక్కడి నుంచి తప్పించుకుంది. పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఆరు ద్విచక్రవాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి.