తెలంగాణ

telangana

ETV Bharat / international

రెస్టారెంట్ యజమానులకు 1446 ఏళ్ల జైలు శిక్ష! - 1,446 years jail

ఫుడ్​ ఓచర్లను విక్రయించి కస్టమర్లను మోసం చేశారనే కేసులో సీఫుడ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఇద్దరు యజమానులకు ఏకంగా 1446 ఏళ్ల జైలు శిక్ష విధించింది థాయిలాండ్​ కోర్టు. వీరిపై 818 మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

Thai seafood fraudsters sentenced to 1,446 yrs in jail
రెస్టారెంట్ యజమానులకు 1446ఏళ్ల జైలు శిక్ష

By

Published : Jun 11, 2020, 7:02 PM IST

వినియోగదారులను మోసం చేసినందుకు సీఫుడ్​ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఇద్దరు యజమానులకు 1446 ఏళ్ల జైలు శిక్ష విధించింది థాయిలాండ్​ న్యాయస్థానం. తమకు వోచర్లను విక్రయించి మోసం చేశారని రెస్టారెంట్ యజమానులపై వందలాది మంది ఫిర్యాదు చేశారు.

వోచర్ల మోసం...

బ్యాంకాక్​లోని ఓ సీఫుడ్​ రెస్టారెంట్​.. కస్టమర్ల కోసం గతేడాది ఫుడ్​ వోచర్లతో ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు ముందుగా డబ్బు చెల్లించి వీటిని కొనుగోలు చేయాలి. ధర తక్కువ ఉన్నందున్న కస్టమర్లు ఆసక్తి చూపారు. 20 వేల మంది కస్టమర్లు 1.6 మిలియన్​ డాలర్లు విలువ చేసే కూపన్లను కొనుగోలు చేశారు. సాధరణంగా ఉండే రేట్ల కంటే చౌకగా ధరలు ఉండటమే ఇందుకు కారణం.

వోచర్లు కొన్న వారికి మెదట్లో అడ్వాన్స్​ బుకింగ్ పద్ధతిలో రెస్టారెంట్​ సేవలు అందించింది. అయితే బుకింగ్ ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టేది. ఆ తర్వాత మార్చిలో రెస్టారెంట్​ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. డిమాండ్​కు తగ్గ సీఫుడ్ దొరకడం లేదని చేతులెత్తేసింది . వోచర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తామంది.

రెస్టారెంట్ తమను మోసం చేసిందని 818 మంది కస్టమర్లు కోర్టులో ఫిర్యాదు చేశారు. డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్​ చేశారు. వారిలో 375 మందికి మాత్రమే రీఫండ్ చేసింది రెస్టారెంట్​.

ఈ కేసు విచారణ జరిపిన అనంతరం లేమ్​గేట్​ ఇన్​ఫినైట్​ రెస్టారెంట్ యజమానులు అపిఛార్ట్​ బోవార్న్​బంచరక్​, ప్రాపసోర్న్​ బోవర్న్​బంచలకు చేరో 1446 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

తప్పు అంగీకరించి శిక్ష తగ్గించాలని కోర్టును ప్రాధేయపడగా జైలు శిక్షను 723 ఏళ్లు తగ్గించింది.

2017లో ఓ కేసులో దోషికి ఏకంగా 13,000 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది థాయ్​లాండ్ న్యాయస్థానం

ABOUT THE AUTHOR

...view details