అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మూడు చోట్ల బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాయి. సామాన్యులు లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో రెండు బాంబులు ఒకే ప్రాంతంలో పేల్చివేశారని అఫ్ఘాన్ పోలీసులు నిర్ధరించారు.
మరో బాంబును విశ్వవిద్యాలయానికి వెళుతున్న బస్సుకు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 10మంది గాయపడ్డారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారని సమాచారం.