తెలంగాణ

telangana

ETV Bharat / international

కరాచీ స్టాక్ మార్కెట్​పై ఉగ్రదాడి- 11మంది బలి - కరాచీ ​ స్టాక్ ఎక్స్చేంజ్​పై దాడి

TERROR ATTACK IN PAKISTHAN
పాక్ స్టాక్​ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడి

By

Published : Jun 29, 2020, 11:27 AM IST

Updated : Jun 29, 2020, 3:11 PM IST

15:02 June 29

పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్​ ఘటనలో 11కు చేరిన మృతులు

పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్​పై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది. తుపాకులు, గ్రనేడ్లతో తీవ్రవాదులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఓ పోలీస్ అధికారి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొదట స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భవనం ప్రధాన ద్వారం వద్ద గ్రనేడ్‌ విసిరిన ఉగ్రవాదులు..తర్వాత భవనంలోకి చొచ్చుకెళ్లి తుపాకీతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ముష్కరులతో పోరాడుతూనే స్టాక్ ఎక్స్చేంజ్‌ భవనంలోని సిబ్బందిని ఖాళీ చేయించాయి.

11:45 June 29

ఉగ్రదాడి: నలుగురు ముష్కరులు సహా 9 మంది మృతి

పాకిస్థాన్​లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. కరాచీలోని పాకిస్థాన్​ స్టాక్ ఎక్స్చేంజ్​పై నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఎస్‌ఐ, నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పోలీసులు... నలుగురు ముష్కరులను హతమార్చారు. 

మొదట స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భవనం ప్రధాన ద్వారం వద్ద గ్రనేడ్‌ విసిరారు ఉగ్రవాదులు. ఆ తర్వాత భవనంలోకి చొచ్చుకెళ్లి తుపాకీ కాల్పులతో చెలరేగిపోయారు. అప్రమత్తమైన బలగాలు.. ముష్కరులతో పోరాడుతూనే స్టాక్ మార్కెట్ భవనంలోని సిబ్బందిని ఖాళీ చేయించారు. బలగాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్ర దాడితో స్టాక్‌ ఎక్స్చేంజ్‌లోని సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఈ దాడిలో మరికొందరికి గాయాలయ్యాయి.

11:23 June 29

కరాచీ స్టాక్​ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడి

పాకిస్థాన్​ కరాచీ స్టాక్​ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడి జరిగింది. నలుగురు ఉగ్రవాదులు భవనంలోకి చొరబడి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. 

అయితే ఇద్దరు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టినట్లు సమాచారం. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

Last Updated : Jun 29, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details